చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఈ పోరులో గెలుపు కోసం ఇరుజట్లు సిద్ధమయ్యాయి. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ తమ జట్టు గెలుపుపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. తమ ఆటగాళ్లను కలిసి ప్రోత్సహించిన ఆయన, పాక్ ఆటగాళ్లు ఫాంటాస్టిక్ ఫాంలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఈ శిక్షణలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించకపోతే, వారి సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాక్, భారత్ చేతిలో ఓడితే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశముంది. మరోవైపు, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గెలిస్తే, సెమీస్‌కి మరింత దగ్గరవుతుంది.
లాహోర్‌లో మ్యాచ్ జరిగి ఉంటే?
మ్యాచ్ లాహోర్‌లో జరిగి ఉంటే మీకు ఎలా అనిపించేదని విలేకరులు ప్రశ్నించగా, నఖ్వీ సమాధానంగా – “ఆ ప్రశ్న భారతీయులనే అడగాలి” అని అన్నారు. పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నప్పటికీ, భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతోంది.
భారత జాలర్ల విడుదల
భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ వైపు నుంచి 22 మంది భారతీయ జాలర్లను విడుదల చేసినట్టు నఖ్వీ పేర్కొన్నారు. కరాచీలోని మాలిర్ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, శిక్ష పూర్తయినా, అతడు భారతీయుడని తెలిసినా పాక్ అధికారులు విడిచిపెట్టకపోవడంతో జనవరి 23న కరాచీ జైలులో భారత జాలరి ఒకరు మరణించారు. దీంతో పాక్ జైళ్లలో మరణించిన భారత జాలర్ల సంఖ్య 8కి చేరుకుంది. అలాగే, శిక్షా కాలం పూర్తి చేసుకున్న 180 మంది భారత జాలర్లు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని విడుదల చేయాలని భారత్ చేస్తున్న విజ్ఞప్తులను పాక్ పెడచెవిన పెడుతోంది. కాగా, శుక్రవారం 15 మంది భారత జాలర్ల బృందం శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకుంది. అనంతరం వారిని స్వగ్రామాలకు తరలించారు.

మోసిన్ నఖ్వీ నమ్మకం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ ఆటగాళ్లను కలిసిన నఖ్వీ, వారికి అండగా ఉన్నట్లు తెలిపారు. “మేము మా ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతున్నాం. వారు ఫాంలో ఉన్నారు. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు” అని నఖ్వీ అన్నారు.
పాక్ క్రికెట్ బోర్డులో చైర్మన్ గా మోసిన్ నఖ్వీ నియామకం.పాకిస్థాన్ జట్టును మరింత బలంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్, వారి ప్రదర్శన, కోచింగ్ పద్ధతులు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో భారత జట్టుతో జరగనున్న కీలకమైన మ్యాచ్ గురించి నఖ్వీ స్పందించారు. భారత్‌తో మ్యాచ్ గెలవడం తమ జట్టుకు అత్యవసరమని, ఆటగాళ్లు గెలుపుపై పూర్తిగా దృష్టి పెట్టారని చెప్పారు.