ఎండాకాలం వచ్చిందంటే మనం ఒంటిని చల్లబర్చుకునే మార్గాలను వెతుక్కుంటాం. సమ్మర్ లో దొరికే తాటి ముంజలు దీనికి సహాయపడే సహజమైన శక్తివంతమైన పండు. తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి సహజమైన జెల్లీలా ఉంటాయి, తినడానికి మృదువుగా, రుచిగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

తాటి ముంజలలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా- విటమిన్ A, B, C – శక్తిని అందించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఐరన్ & జింక్ – రక్తహీనత నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఫాస్పరస్ & పొటాషియం – శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడతాయి. న్యూట్రియెంట్స్ రిచ్ – తక్కువ క్యాలరీలు, అధికమైన నీటి శాతం ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
తాటి ముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
డీహైడ్రేషన్ నుండి రక్షణ
ఎండకాలంలో చెమట ద్వారా శరీరంలోని నీరు, ఖనిజలవణాలు తగ్గిపోతాయి. తాటి ముంజలలో అధిక నీటి శాతం ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేసవి వేడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఎండకాలంలో ఎక్కువగా జలుబు, ఆమ్లత్వం, కడుపు మంటలు కలగడం సహజం. తాటి ముంజలు ఆమ్లత్వాన్ని తగ్గించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే సహజ ఔషధంగా పనిచేస్తాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
తక్కువ క్యాలరీలు ఉండటంతోపాటు, అధిక పోషక విలువలు ఉండడం వల్ల తాటి ముంజలు బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో మేలు చేస్తాయి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
కాలేయ సంబంధిత సమస్యలను నివారించడంలో తాటి ముంజలు సహాయపడతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. తాటి ముంజలు మూత్ర విసర్జన వ్యవస్థను శుభ్రంగా ఉంచి, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గర్భిణీల ఆరోగ్యానికి మేలు
గర్భిణీలు వేసవిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు తాటి ముంజలు తింటే మంచిది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, పోషక విలువలను అందించేందుకు ఉపయోగపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
తాటి ముంజలలో ఉన్న నైట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతాయి. వేసవిలో తరచుగా బ్రేక్ అవుట్స్, పిమ్పుల్స్ రావడం సాధారణం. తాటి ముంజలు తినడం వల్ల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.
పిల్లలకు బలం అందించే సహజ పండు
పిల్లలు వేసవిలో నీరసంగా, అలసిపోయినట్లుగా అనిపిస్తే, తాటి ముంజలు తినిపిస్తే శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే సహజమైన చక్కెరల వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు తాటి ముంజలను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లో ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కూలీలు, రైతులు, ఆటగాళ్లు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
హీట్ స్ట్రోక్ నివారణ
తాటి ముంజలు తినడం ద్వారా తీవ్రమైన వేసవి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వేసవిలో తరచుగా నీరసం, తలనొప్పి, వాంతులు రావడం వంటి సమస్యలు ఉంటే, తాటి ముంజలను ఆహారంలో చేర్చడం. జాగా తినడం ఉత్తమం. శరీరాన్ని చల్లగా ఉంచే రిఫ్రెషింగ్ డ్రింక్. తాటి ముంజలతో స్వీట్ స్మూతీలు చేసుకోవచ్చు. పండ్లతో మిక్స్ చేసి తింటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. వేసవి కాలం కోసం ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం తాటి ముంజలు. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, వేసవి వేడిని తట్టుకునేందుకు సహాయపడతాయి. తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే, తప్పకుండా తాటి ముంజలను ఆహారంలో భాగం చేసుకోవాలి.