తరచూ వివాదాల్లో ట్రంప్‌..ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత

Trump : టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు: ట్రంప్‌

Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌లపై మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశానికి కూడా అమెరికా టారిఫ్‌ల నుంచి మినహాయింపు లేదని చెప్పారు. ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ లభించదని తేల్చేశారు. తన కఠినమైన వాణిజ్య విధానాన్ని ఆయన ఆదివారం పునరుద్ఘాటించారు. మా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు, నాన్‌ మానిటరీ టారిఫ్‌ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికి మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు రాదు. ఆ దేశం మాతో దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎటువంటి టారిఫ్‌ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు 20శాతం ఫెంటనిల్‌ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్‌ బకెట్‌లోకి మారాయి.

Advertisements
టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు

అప్పుడే మనం చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటాం.

రానున్న నేషనల్‌ టారిఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో సెమీకండెక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్‌ సామగ్రిని పరిశీలిస్తున్నాం. దీనిని బట్టి దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తేలింది. అప్పుడే మనం చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటాం. ఆ దేశం అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడుకొంటోంది. దానిని మేము కొనసాగనీయం. ఆ రోజులు ముగిశాయి. అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను, నియంత్రణల్లో భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి.. గతంలో ఇతర దేశాలు.. ముఖ్యంగా చైనా మనతో ఎలా వ్యవహరించిందో.. మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే.. మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత పెద్దది, మెరుగైంది, బలమైందిగా మార్చనున్నాం..అని మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

Read Also: ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

Related Posts
Yasangi : త్వరలో అకౌంట్లోకి డబ్బులు
bonas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌లో రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ Read more

రాహుల్ గాంధీపై పౌరసత్వ వివాదం…
Rahul Gandhi

ఈ మధ్య కాలంలో అలహాబాద్ హైకోర్టు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ Read more

కేరళ లో ఘోర రోడ్డు ప్రమాదం..మెడికో స్టూడెంట్స్ మృతి
kerala road accident

కేరళలోని అలెప్పి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి భారీ వర్షం సమయంలో వేగంగా వచ్చిన కారు, బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మెడికో Read more

Chandrababu : నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు
టిడిపిని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×