దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 20వ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ జట్టు 140 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 129 పరుగులకే పరిమితమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు టీ20 క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.పార్ల్ రాయల్స్ టీమ్ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SAT20 లీగ్‌లో 5 స్పిన్నర్లతో 20 ఓవర్లను పూర్తి చేయడం ద్వారా ఈ రికార్డును సాధించింది.

బోలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సమరం జరిగింది.ప్రిటోరియా క్యాపిటల్స్ కెప్టెన్ రిలే రోసోవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.పార్ల్ రాయల్స్ తరపున జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 56 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 78 పరుగులు సాధించారు. ఈ రాణితో పాటు, పార్ల్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.ప్రిటోరియా క్యాపిటల్స్ 141 పరుగుల లక్ష్యంతో రాణించడానికి ప్రయత్నించింది, కానీ పార్ల్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ ముందు కష్టపడింది. డేవిడ్ మిల్లర్, 5 స్పిన్నర్లను ఉపయోగించి 20 ఓవర్లను పూర్తి చేసారు. జోర్న్ ఫార్టుయిన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీసారు.
దునిత్ వెల్లాల 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.ఇలా, పార్ల్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ ముమ్మరంగా పనిచేసి ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును 20 ఓవర్లలో 129 పరుగులకే పరిమితం చేయగలిగింది. చివరికి, 11 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్ విజయం సాధించింది.ఈ విజయంతో పాటు, టీ20 క్రికెట్‌లో 5 స్పిన్నర్లతో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన మొదటి జట్టుగా పార్ల్ రాయల్స్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.