New CM's 'Women's Day' gift to Delhi women

ఢిల్లీ మహిళలకు కొత్త సీఎం ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్

మహిళల అకౌంట్లలో రూ.2500 జమ

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా నగర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్చి 8 (ఉమెన్స్ డే) లోపు మహిళల అకౌంట్లలో రూ.2500 జమ చేస్తామని ప్రకటించారు. తాను ప్రజల ముఖ్యమంత్రిగా వారి మధ్యే ఉంటానని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ‘శీశ్ మహాల్‌’లో ఉండబోనని స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే ఆమె రామ్‌లీలా మైదానానికి చేరుకోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

image

బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని

విద్యార్థి నాయకురాలిగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం సాగించిన 50 ఏళ్ల రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి ముందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్-వెస్ట్ ) నియోజవర్గం నుంచి 68,200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా లాయర్ అయిన 1996 నుంచి 1997 వరకూ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మున్సిపల్ రాజకీయాల్లోకి అడుగపెట్టి ఉత్తరి పితాంపుర (వార్డు 54) నుంచి 2007లో గెలిచారు. తిరిగి 2012లో ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.

ప్రమాణస్వీకారం

గురవారం ఉదయం 12.05 గంటలకు రేఖా గుప్తా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు. ప్రఖ్యాత్ రామ్‌లీలా మైదాన్‌లో జరుగనున్న ఈ వేడకుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 50 మందికి సీనీతారలు, పారిశ్రామిక వేత్తలతో పాటు దౌత్యవేత్తలు, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.

Related Posts
‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్..?
'Game changer' police instr

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

భారతదేశ సముద్ర భద్రతకు నావికాదళ యోధులు
భారతదేశ సముద్ర భద్రతకు నావికాదళ యోధులు1

ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు, ఇది దేశ సముద్ర భద్రతకు అపూర్వమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. Read more

Siddharth Luthra: 45 రోజులు, 4 కేసులు – సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు – వైసీపీ
Sidharth Luthra

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మిత్రుడైన సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ Read more

2028 లో ప్రారంభం కానున్న శుక్రయాన్ మిషన్..
isro shukrayaan

భారతదేశం 2028 లో ప్రారంభం కానున్న "శుక్రయాన్" అనే వెనస్ ఆర్బిటర్ మిషన్‌తో ఒక ముఖ్యమైన స్పేస్ మైల్‌స్టోన్‌ను సాధించడానికి సిద్ధమవుతోంది.ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) Read more