West Bengal Phase 2 Polling: బెంగాల్ క్లైమాక్స్.. పోలింగ్ లో దుమ్మురేపుతున్న ఓటర్లు!

Follow Us: Google News Daily Hunt
West Bengal Phase 2 Polling
West Bengal Phase 2 Polling
FONT SIZE
GET APP

West Bengal Phase 2 Polling: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. నేడు (బుధవారం, ఏప్రిల్ 29, 2026) జరుగుతున్న రెండో, చివరి దశలో 142 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి దశలో ఏకంగా 93.2 శాతం రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కాగా, నేడు కూడా అదే స్థాయి ఉత్సాహం కనిపిస్తోంది.

Read Also:Odisha: రూ. 19,300 కోసం ఇంత నరకమా!అస్థిపంజరాన్ని తెస్తేనే డబ్బులిస్తారా?

West Bengal Phase 2 Polling: Bengal climax.. Voters are dusting up the polling!
West Bengal Phase 2 Polling: Bengal climax.. Voters are dusting up the polling!

క్యూలైన్లలో ఓటర్ల బారులు

కోల్‌కతా, హౌరా, నార్త్ మరియు సౌత్ 24 పరగణాలు, నదియా వంటి కీలక జిల్లాల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు బీజేపీ నేత సువేందు అధికారి మధ్య పోరు జరుతుండటంతో అందరి కళ్లు ఇక్కడే ఉన్నాయి. అనేక చోట్ల ఉదయం 7 గంటల నుండే ఓటర్లు బారులు తీరారు.

అడపాదడపా ఉద్రిక్తతలు

పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నదియా జిల్లాలో ఒక బీజేపీ ఏజెంట్‌పై దాడి జరిగినట్లు వార్తలు రాగా, మరికొన్ని చోట్ల ఈవీఎంల (EVM) మొరాయింపుతో పోలింగ్ కాసేపు ఆలస్యమైంది. భద్రతా బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు