Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య మయన్మార్‌లో సంభవించిన భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణించిన వారి సంఖ్య 2 వేల మార్కును దాటి 2,056కి చేరినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంపం ధాటికి కూలిన భవనాల శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 3,900 మంది గాయపడ్డారని, ఇంకా 270 మందికి పైగా అదృశ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు వివిధ దేశాలు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.

భారత్‌తో పాటు యూరోపియన్ యూనియన్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాలు మయన్మార్‌కు ఆర్థిక, సహాయ సహకారాన్ని అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.ఇదిలా ఉండగా, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా స్వల్ప భూకంపం ధాటికి నడిచింది. షియోమి ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించిందని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు భూగర్భ పరిశోధన సంస్థలు గుర్తించాయి. ఈ భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.