రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ‘ఎన్నికల ఫలితాలకు ముందే రూ.లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా. అదంతా రైతుల కోసమే కదా? కానీ ఈ రోజు నాకు అండగా ఏ రైతు అయినా వచ్చారా? కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కొందరికి ఉండదు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించానని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమే చేశానని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ కొందరికి ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే మాటను ఒకటికి రెండు సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.