ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవాళ(శుక్రవారం) మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మృతిచెందరాని..మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఎదురు ఎదురు కాల్పులు జరిగడంతో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
కాగా, నిన్న ఒరిస్సా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే..ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్, బీహార్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైందని.. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు, నాలుగు జిల్లాల్లో ఈ సమస్య కొనసాగుతోందని అన్నారు. దాన్ని అణచివేసేందుకు కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.