Marriage age lowered to 18 in Nepal!

Nepal: నేపాల్‌లో వివాహ వయసు 18కి తగ్గింపు !

Nepal: నేపాల్‌ ప్రభుత్వం వివాహానికి కనీస అర్హత వయసును 20 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. బాల్య వివాహాలకు విధించే జరిమానానూ తగ్గించాలని భావిస్తోంది. వివాహ వయసు 20 ఏళ్లు ఉండటంవల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అత్యాచారాలు పెరగడానికే కారణమవుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే వివాహ వయసును తగ్గించేలా బాలల చట్టం, క్రిమినల్‌ కోడ్‌లను సవరించాలని నిర్ణయించామని న్యాయశాఖ మంత్రి అజయ్‌ చౌరాసియా సోమవారం తెలిపారు. ఈ చట్ట సవరణ బిల్లుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, వైద్య, మానసిక నిపుణులను సంప్రదిస్తున్నామని వివరించారు.

image


ప్రస్తుత వివాహ వయసు ఫలితాలివ్వడం లేదు

చట్ట సవరణకు ప్రభుత్వం తుది రూపునిస్తోందని హోంశాఖ మంత్రి రమేశ్‌ లేఖక్‌ తెలిపారు. ప్రస్తుత వివాహ వయసు ఫలితాలివ్వడం లేదు. ప్రభుత్వం రెండు మోడళ్లపై కసరత్తు చేస్తోంది. అందులో మొదటిది వివాహ వయసును తగ్గించడం. రెండోది రోమియో జూలియట్‌ చట్టం. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రోమియో జూలియట్‌ చట్టం ప్రకారం.. వివాహం కాకున్నా.. నిర్దేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీ యువకులు శృంగారంలో పాల్గొన్నా దానిని రేప్‌గా పరిగణించరు. వారిద్దరి మధ్య రెండు మూడేళ్ల గ్యాప్‌ మాత్రమే ఉండాలి.

18 ఏళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు

నేపాల్‌లోని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 2017 ప్రకారం.. 18 ఏళ్లలోపు యువతితో లైంగిక సంబంధం నెరిపితే రేప్‌గా పరిగణిస్తారు. ఆ యువతికి అంగీకారమున్నా చట్టం ఒప్పుకోదు. దీంతో వేల మంది యువకులు 18 ఏళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా, వారి అంగీకారంతో పెళ్లాడినా బాల్య వివాహ నేరంతోపాటు రేప్‌ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ విధానాన్ని మార్చాలని నేపాల్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Related Posts
14 నెలల ఘర్షణ అనంతరం లెబనాన్‌లో శాంతి: ప్రజలు తమ ఇళ్లకు తిరిగి చేరుకున్నారు
ceasefire

ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య 14 నెలలపాటు కొనసాగిన ఘర్షణకు ఓ ముగింపు పలికిన తర్వాత, లెబనాన్ దేశంలో శాంతి నెలకొంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు Read more

పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం
Fog effect.. Many flights are delayed

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు Read more

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

రాజారెడ్డి ఐ సెంటర్ న్ను ప్రారంభించిన జగన్
Raja Reddy Eye Center

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *