సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి

Malla Reddy who meet CM Revanth Reddy

హైదరాబాద్‌ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా తన మనవరాలి వివాహానికి రావాలని పెళ్లి పత్రికను సీఎంకు మల్లారెడ్డి అందించారు. సీఎంతో పాటు మల్లారెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మల్లారెడ్డి కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీ సీఎంతో తీగల కృష్ణారెడ్డి సైతం ఉన్నారు. ఇదిలా ఉండగా మల్లారెడ్డి అల్లుడు అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు.

ఇకపోతే..గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Latest sport news. 広告掲載につ?.