Leopard attack on woman

మహిళపై చిరుత దాడి

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Advertisements

చిరుతపులి దాడి సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులను చూసి చిరుత భయపడి పారిపోయింది. ఈ ఘటన తర్వాత గ్రామస్థులందరూ భయంతో ఉన్నారు. అటవీ ప్రాంతం సమీపంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారికీ నిద్రపట్టడం లేదు. గ్రామస్తులు ఈ సమస్యను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చర్యలు తీసుకుని చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు కొన్ని సూచనలు చేశారు. ఒంటరిగా బయలుదేరొద్దని, బయటికి వెళ్లేటప్పుడు కర్ర లేదా ఆయుధాన్ని వెంట తీసుకెళ్లాలని సూచించారు. చిరుత పులుల హడావిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Related Posts
ఆర్జీ కార్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలి: సీబీఐ
ఆర్జీ కార్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలి సీబీఐ

కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో పౌర స్వచ్ఛంద సేవకుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ కోర్టు Read more

షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

Faroe Islands : చంద్రుని శక్తితో లోకానికి వెలుగు
Faroe Islands చంద్రుని శక్తితో లోకానికి వెలుగు

ఉత్తర అట్లాంటిక్ సమీపంలోని చిన్నతరహా ఫారో దీవులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప సమూహం, ఒక అరుదైన అంతరిక్ష శక్తి Read more

2026లో ప్రారంభం కానున్న “ప్రాజెక్ట్ సన్‌రైజ్”
qantas project sunrise

2026లో ప్రారంభం కానున్న ప్రపంచంలోని అతి పొడవైన విమాన ప్రయాణం, ప్రయాణికులకు రెండు సూర్యోదయాలను చూడట అనుభవం ఇస్తుంది. ఈ ప్రత్యేక ప్రయాణం కోసం ఎయిర్‌బస్ A350 Read more

Advertisements
×