రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే . ఈ క్రమాలు దీనిపై కోర్ట్ విచారణ చేపట్టింది.ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.

దీనిపై ఈ నెల 14న విచారణ జరిప కోర్టు కేసును 18కి వాయిదా వేసింది. పిటిషనర్ కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో కేటీఆర్ ఈ నెల 18న నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్​మెంట్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాధోడ్, తుల ఉమ, దాసోజుశ్రవణ్ లను పిటిషన్ సాక్షులుగా చేర్చడంతో వారు సైతం స్టేట్​మెంట్ ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. (ap) — the families of four americans charged in.