తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో రష్మిక మందన్న దూసుకుపోతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా నిలుస్తున్న ఈ కన్నడ బ్యూటీ, తాజాగా ‘ఛావా’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ కన్నడ బ్యూటీ, తెలుగులో పుష్ప 2 వంటి భారీ చిత్రంలో నటించారు అయితే, ఛావా ప్రమోషన్‌లో భాగంగా ఆమె చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదమైంది.ఈ సినిమా ప్రమోషన్‌లో ఆమె హైదరాబాద్ గురించి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి.

కన్నడ సినీ ప్రేక్షకుల ఆగ్రహం:
రష్మిక తన సినీ ప్రయాణాన్ని కన్నడ పరిశ్రమలో ప్రారంభించినప్పటికీ, హీరోయిన్‌గా అక్కడే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు అక్కడ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆ టైంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తెలుగులో ఆమెకు ఇక్కడ ఆఫర్లు పెరిగాయి. చివరకు పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఈ విషయం అక్కడి ఆడియెన్స్‌కు అంతగా నచ్చలేదు. అందరూ రక్షిత్ శెట్టిపై సింపతీ చూపించారు. ఇక రష్మికపై అలా అలా అక్కడ ద్వేషం పెరుగుతూనే వచ్చింది.
కన్నడలో ఎంట్రీ: రష్మిక 2016లో ‘కిరిక్ పార్టీ’ ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు.
తెలుగులో క్రేజ్: ఛలో, గీత గోవిందం, పుష్ప వంటి విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ అయ్యారు.
హిందీ ఎంట్రీ: మిషన్ మజ్ను, యానిమల్ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కన్నడ పరిశ్రమకు దూరంగా, తెలుగుకు దగ్గరగా ఉండటాన్ని కన్నడ ప్రేక్షకులు అసహనంగా భావిస్తున్నారు.
రష్మిక తాజా వివాదం: హైదరాబాద్ నుంచి వచ్చాను ఛావా ప్రమోషన్లలో రష్మిక మాట్లాడుతూ
నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ చూసి ఎంతో సంతోషంగా ఉంది. అని వ్యాఖ్యానించారు. ఈ మాట కన్నడలో తీవ్ర విమర్శలకు దారితీసింది.
సొంత ఊరు విరాజ్‌పేట గురించి ప్రస్తావించకపోవడం హైదరాబాద్‌ను తన స్థలంగా చెప్పడం
కన్నడ పరిశ్రమను పూర్తిగా దూరం చేసుకోవడం ఈ అంశాలపై కన్నడ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే సొంతూరు విరాజ్‌పేట గురించి చెప్పకపోవడాన్ని కన్నడ వాసులు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల కూడా కన్నడిగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రష్మికకి, కన్నడిగులకు మధ్య దూరం ఇంకా ఇలానే పెరుగుతూ ఉంటుందేమో. రష్మిక సైతం కన్నడ ఇండస్ట్రీని లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాంతార టైంలోనూ రష్మిక తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ శెట్టి సైతం రష్మిక మీద పరోక్షంగా కౌంటర్లు వేశాడు. రష్మిక ప్రస్తుతం ఛావా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే దాన్ని ఇష్టమొచ్చినట్టుగా ఎడిట్ చేసి ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఇదే ఛావా ప్రమోషన్స్‌లో రష్మిక ఎన్నో సార్లు కూర్గ్ నుంచి వచ్చాను అని చెప్పిందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.