మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల

మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల..!

కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు ప్రసిద్ధ వచనం “దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్”ను ప్రస్తావిస్తూ, దేశ అభివృద్ధి కోసం మోదీ సర్కార్ చేస్తున్న కృషి వివరించారు. ఈ సందర్భంగా, దేశవ్యాప్తంగా అభివృద్ధి చర్యలు చేపట్టడం, వివిధ రంగాలకు కేటాయింపులు పెంచడం ముఖ్యంగా ప్రస్తావించారు.మొత్తం మీద, బడ్జెట్‌లో కొన్ని కీలకమైన ప్రకటనలు వెలువడ్డాయి. మొదటగా, మధ్య తరగతి వారికి భారీగా పన్ను రీళీఫ్ ప్రకటించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇస్తూ, 12 లక్షలపై ఆధారపడి పన్ను శ్లాబులు పెట్టాలని తెలిపారు. 16-20 లక్షల ఆదాయం ఉన్న వారికి 20% పన్ను, 20-24 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 25%, 24 లక్షలపై 30% పన్ను విధించనున్నట్టు పేర్కొన్నారు.

ఇక, ఆరు కీలక రంగాలలో సమూల మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. అలాగే, కిసాన్ క్రెడిట్ రుణాలు పెంచడం, MSMEలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల రుణాలు అందించాలనేది కూడా కీలక నిర్ణయాలుగా ఉన్నాయి.విద్యారంగం పై కూడా బడ్జెట్‌లో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. వైద్య రంగంలో గడిచిన 10 సంవత్సరాల్లో 1.01 లక్షల వైద్య సీట్లు పెంచినట్లు తెలిపారు.

రానున్న ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు కల్పిస్తామని ప్రకటించారు.2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.అదే విధంగా, మౌలిక వసతుల అభివృద్ధి కోసం 10,148 లక్షల కోట్లు కేటాయించారు. భారతీయ ఎగుమతుల కోసం కొత్త ‘న్యూ ఎక్స్‌పోర్ట్ మిషన్’ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

2028 వరకు జల్ జీవన్ మిషన్‌ను కొనసాగిస్తామని, 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు అందించాలనేది కూడా ముఖ్య నిర్ణయంగా ఉంది.వ్యవసాయ రంగంపై కూడా పెద్ద పీట వేసారు. పప్పుదాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక, బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళికలు వంటి ముఖ్య నిర్ణయాలు ప్రకటించారు.ఇక, బీహార్‌కు పెద్ద కేటాయింపులు జరిగినాయి. మఖానా బోర్డు ఏర్పాటు, పాట్నా IIT విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం, 15 వేల కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు ప్రకటించారు.

Related Posts
వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు.. అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల Read more

చంద్రబాబు పవన్ లపై ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
సునీల్ కుమార్ సస్పెన్షన్ పై ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఐడీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌పై తీవ్ర రాజకీయ చర్చలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సునీల్‌ కుమార్‌ ప్రభుత్వ అనుమతి Read more

ప్రియాంకా గాంధీ బంగ్లాదేశ్ మైనారిటీలకు మద్దతు..
priyanka gandhi bangladesh bag

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, సోమవారం పార్లమెంట్లో "పాలస్తీన్" అనే పదం గల బాగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకా గాంధీ వాఢ్రా, మంగళవారం Read more

‘బాబు – షర్మిల’ ల ముసుగు తొలిగిపోయింది అంటూ వైసీపీ ట్వీట్
babu sharmila

జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేయడంపై వైసీపీ స్పందించింది. 'ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *