మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీని ఏం చేయదలుచుకున్నారో ఇప్పటి వరకు చెప్పలేదు. లక్షా 50 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎవడు చెప్పాడు అంటుండు. ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు.. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులు మీకు తెల్వట్లేదు.
చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా..? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఏమిటో చూద్దాం. భట్టి విక్రమార్క ప్రకటించిన జాబితా ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా..? కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం కలిగింది. రూ. వందల కోట్లు కొల్లగొట్టి కడుపులు నింపుకోవాలనేది ఆలోచన. హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణం కాదా..? అని జగదీశ్ రెడ్డి వరుస ప్రశ్నలు సంధించారు.