యుద్ధ ప్రభావంతో విమానాల రద్దు
Flights cancellations : పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణాపైనా పడింది. భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
భారీగా తగ్గిన విమాన సర్వీసులు
సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Anupama Parameswaran: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నటి అనుపమ?

పైలట్ల డ్యూటీ సమయాల్లో సడలింపు
ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: