Heavy Rains: రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి అతి భారీ వర్ష సూచన

bangfala

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌ తీరానికి భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో హిందూ మహాసముద్రం పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా మరింత విస్తరిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దీని ప్రభావంతో అక్టోబర్ 14 న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా తీరం వైపు చేరే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

అల్పపీడన ప్రభావం:
ఈ అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత వర్షాలు పడనున్నాయని IMD తెలిపింది. ముఖ్యంగా, అక్టోబర్ 14 నుంచి 17 వరకు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అక్టోబర్ 17 నాటికి ఈ వర్షాలు ఉత్తరాంధ్ర మరియు యానాం ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీ వర్షాలకు జాగ్రత్తలు:
ఈ వర్షాల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్తులు ఏర్పడకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. మత్స్యకారులకు ఈ వర్షాల సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద పరిస్ధితుల్లో స్థానిక అధికారుల సూచనలను పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు.

వర్షాల ముప్పు:
రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నీటి ప్రవాహాలు, లోతట్టు ప్రాంతాల్లో వరదలు రావచ్చు కాబట్టి, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Southeast missouri provost tapped to become indiana state’s next president. India vs west indies 2023.