Harish Kumar Gupta is the new DGP of AP

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.

ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పని చేస్తానని అన్నారు.

కాగా, ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా బాధ్యతలు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌.. డీజీపీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అనివార్యం కాగా.. హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా.. ప్రస్తుతం ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.

Related Posts
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో పాల్గొని, ఆర్‌కే పురంలో ఓ భారీ సభను నిర్వహించారు. 11 ఏళ్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనపై Read more

చంద్రబాబుపై మాజీ టీటీడీ చైర్మన్ ఆరోపణలు
చంద్రబాబుపై మాజీ టీటీడీ చైర్మన్ ఆరోపణలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీవై సుబ్బారెడ్డి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటనపై తీవ్రంగా స్పందించారు. భక్తుల Read more

SLBC టన్నెల్ ప్రమాదం – ఎనిమిది మంది మృతి
eight workers dies in slbc

SLBC టన్నెల్ ప్రమాదం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఎస్ఎల్‌బీసీ (సుగర్ లిఫ్ట్ బ్యాంక్ క్యానాల్) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. Read more

విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం
విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం

విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ షిప్ సేవలు పెరుగుతున్నాయి. తాజాగా, కార్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం చేరుకునే సమయం ఖరారైంది. ఈ క్రూయిజ్ షిప్ సర్వీసుల గురించి విశాఖపట్నం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

/