ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ ప్రత్యేక శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టూడియో ఘిబ్లీ చేసిన ‘స్పిరిటెడ్ అవే’, ‘మై నెయిబర్ టోటోరో’, ‘ద బోయ్ అండ్ ద హెరాన్’ వంటి చిత్రాల శైలి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉంది. వాటర్‌కలర్ టెక్స్చర్, సున్నితమైన రంగులు, డ్రీమీ బ్యాక్‌డ్రాప్‌లు, నేచురల్ లైటింగ్, ఫాంటసీ ఎలిమెంట్స్ – ఇవన్నీ ఘిబ్లీ చిత్రాలను ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇప్పుడు, ఆ కళా శైలిని మీ ఫోటోలకూ అందుబాటులోకి తెస్తోంది గూగుల్ జెమినీ AI. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా, మీరు మీ వ్యక్తిగత చిత్రాలను స్టూడియో ఘిబ్లీ లాంటి యానిమే స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ!

స్టూడియో ఘిబ్లీ స్టైల్ ఫోటో ఎలా రూపొందించాలి?
2-అప్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేసి మీ ఫోటోను ఎంచుకోండి. వ్యక్తులు, పెంపుడు జంతువులు, ప్రకృతి దృశ్యాలున్న ఫోటోలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. హై-రిజల్యూషన్ చిత్రాలు ఉంటే మరింత మెరుగైన అవుట్‌పుట్ వస్తుంది.
3-టెక్స్ట్ ప్రాంప్ట్ బాక్స్‌లో ఈ విధంగా వివరణాత్మక ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ఫోటోను మృదువైన పాస్టెల్ రంగులతో, డ్రీమీ బ్యాక్‌డ్రాప్‌తో స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమేషన్లా మార్చండి. మరింత ప్రత్యేకత కావాలనుకుంటే – ఎండమావులున్న ఆకాశం, గంభీరమైన అడవి వాతావరణం, నదీ తీరాన ప్రశాంతమైన సాయంత్రం వంటి అంశాలను కూడా జోడించొచ్చు.
4-మీ ప్రాంప్ట్‌ను జెమినికి పంపించగానే, కొన్ని క్షణాల్లోనే ఫోటోను AI ప్రాసెస్ చేసి యానిమే స్టైల్‌లోకి మార్చేస్తుంది.
5-ప్రధమ అవుట్‌పుట్ మీకు నచ్చకపోతే, మరిన్ని మార్పులు కోరుతూ ఈ విధంగా సూచనలు ఇవ్వొచ్చు. ఆర్ట్‌స్టైల్ మరింత ఘిబ్లీ లా ఉండేలా మెరుగుపరచండి. హయావో మియాజాకి సినిమా వాతావరణంలా రంగుల్ని మెరుగుపరచండి. బాల్యపు నెమలీకలను తలపించేలా లైటింగ్ మార్చండి.
6-చివరిగా, మీ ఫోటోను “Download” లేదా “Save Image” ఆప్షన్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. మీ పూర్తయిన చిత్రాన్ని సేవ్ చేయడానికి డెస్క్‌టాప్‌లో కుడి వైపున క్లిక్ చేయండి. మొబైల్ లో అయితే ఎక్కువ సేపు ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది.