Gadwal MLA Bandla Krishna M

బిఆర్ఎస్ లోనే ఉన్న అంటూ గద్వాల్ ఎమ్మెల్యే క్లారిటీ

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. కొందరు తనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితాన్ని అప్రతిష్ఠపాలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

Bandla Krishna Mohan Reddy3
Bandla Krishna Mohan Reddy3

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

ఈ తప్పుడు ప్రచారంపై గద్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి నిజం లేని ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

గతంలో కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ లోకి

కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అనంతరం తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రచారాలను సహించేది లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తానని హెచ్చరించారు.

Related Posts
Israel: గాజాపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు: 326 కు పెరిగిన మృతులు
గాజాపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు: 326 కు పెరిగిన మృతులు

మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లో విస్తృతమైన వైమానిక దాడులు ప్రారంభించగా, కనీసం 326 మంది మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు Read more

నేడు “సీ ప్లేన్‌”ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu

విజయవాడ: నేడు సీఎం చంద్రబాబు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఇతర అధికారులు కలిసి విజయవాడ - శ్రీశైలం మధ్య Read more

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

జనవరి 21 నుండి 23 వరకు దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు Read more

ఇంటర్ విద్యార్థిని పై ప్రేమోన్మాది ఘాతుకం
A lover who killed an inter

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17) పై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ Read more