వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనేనని జీవీ ఆంజనేయులు అన్నారు.
టీడీపీ రెడ్ బుక్ మాదిరిగానే తాముకూడా ఏదో బుక్ రాస్తున్నట్లు జగన్ చెప్పారన్న ఆయన.. ఆ బుక్ రాసే బదులు రామకోటి రాస్తే పుణ్యమైనా వస్తుందన్నారు. జగన్ కలలో కూడా రెడ్ బుక్కే వస్తున్నట్లుందని, అందుకే ఎక్కడికెళ్లినా దానినే కలవరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వైసీపీ దుకాణం మూతపడటం కారణమని, ఇది జగన్ చేజేతులా చేసుకున్న పతనం అని అన్నారు.