జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్

అసెంబ్లీకి బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. ఇవాళ కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు వస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో వాడీవేడీగా అసెంబ్లీలో చర్చ జరగనుందని భావిస్తున్నారు.

Advertisements
అసెంబ్లీకి బయల్దేరిన మాజీ సీఎం

ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్‌ ఉద్బోధించారు. ఉభయసభలు ప్రారంభమయ్యే నిర్దేశిత సమయానికి ముందే సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పలు అంశాలపై చర్చ

బీఆర్‌ఎస్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, వేస్తున్న నిందలను బలంగా తిప్పికొట్టాలని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజా సమస్యల మీద ఉభయసభల్లో ప్రతిభావంతంగా పోరాడేందుకు, సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వీలుగా డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. సమావేశంలో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related Posts
గ్యాస్ స్టేషన్‌లో పేలుడు..15 మంది మృతి
Explosion at a gas station in Yemen.. 15 people died

యెమెన్​ : యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కనీసం 15 మంది మృతి Read more

Toll Plaza:ఇక సులభంగా టోల్ ప్లాజాను దాటవచ్చు
Toll Plaza:ఇక సులభంగా టోల్ ప్లాజాను దాటవచ్చు

భారత రవాణా రంగంలో మరో ముఖ్యమైన మార్పు రాబోతున్నది. భారత్ లో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ప్రస్తుతం Read more

చిరంజీవి వల్లే నేను ఇక్కడ ఉన్నా – పవన్ కల్యాణ్
pawan speech game chanjer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ 'గేమ్ చేంజర్' ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది. Read more

Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు
Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు

Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసిన వీడియో ఒక సంచలనంగా మారింది.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో Read more

×