ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!

school holidays in august 2 jpg
Dussehra holidays in AP from 3rd of this month!
Dussehra holidays in AP from 3rd of this month!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు… చంద్రబాబు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక క్లాసులు నిర్వహించకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ పదో తరగతి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా, వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్… అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా… ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి

Retirement from test cricket. He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. (philippine coast guard via ap).