Dushara Vijayan: దుషారా విజయన్ కి పెరుగుతున్న క్రేజ్

dashara vijayan

తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల అత్యంత చర్చనీయమైన పేరు దుషారా విజయన్ రాయన్ మరియు వేట్టయన్ సినిమాల విడుదలతో ఆమె పేరు తమిళనాడులో అన్ని వర్గాల ప్రేక్షకులకు పరిచయమైంది. దుషారా దుండిగల్ ప్రాంతానికి చెందిన ఈ నటి 2019లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటినుంచి ఆమె తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ తన ఖ్యాతిని నిత్యం పెంచుకుంటూ వెళుతోంది దుషారాను ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి యువతి పాత్రలలో ప్రేక్షకులు ఇట్టే గుర్తుంచుకుంటారు ఆమె నటన ఆడియన్స్‌కి వెంటనే కనెక్ట్ అవుతుందని నిరూపించిన చిత్రం రాయన్ ఇందులో ధనుశ్ చెల్లెలుగా ఆమె చేసిన పాత్ర సహజంగా ప్రాణం పోసినంతగా కనిపించింది ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది దీనితో ఆమె పేరు తెరపై మాత్రమే కాదు ప్రేక్షకుల ఇంట్లోనూ మార్మోగింది.

ఈ విజయంతో దుషారాకు వేట్టయన్ లో అవకాశం వచ్చింది ఇందులో ఆమె సాధారణ స్కూల్ టీచర్‌గా నటించింది. ఈ పాత్రలో దుషారా అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడే కీలక పాత్ర పోషించింది కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుండటంతో ఆమె ప్రతిభకు ప్రేక్షకుల నుండి విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ రెండు చిత్రాల విజయాల కారణంగా దుషారాకు కోలీవుడ్‌లో భారీ డిమాండ్ పెరిగిపోయింది.ప్రస్తుతం ఆమె విక్రమ్ నటించిన వీర ధీర శూరన్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లలో భాగమవుతూ తన నటనా రంగంలో మరింత ముందుకు సాగుతున్నారు. దుషారా విజయన్‌కి ఉన్న ఈ దూకుడు చూస్తుంటే ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో త్వరలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందాలని ఆశించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A deep dive to the rise of conscious consumerism. With businesses increasingly moving online, digital marketing services are in high demand. Kontaktieren sie mich für ihr maßgeschneidertes coaching in wien.