Simhachalam Chandanotsavam: విశాఖపట్నం పుణ్యక్షేత్రమైన సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవ వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఏడాది మొత్తం చందనపు పూతతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజే తన అసలు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో ఆలయ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.
Read Also :Akshaya Tritiya 2026: తిథి, ముహూర్తం మరియు రాజయోగాల పూర్తి వివరాలు

Simhachalam Chandanotsavam: ఈ సారి సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రక్రియను క్రమబద్ధీకరించారు. ఇందులో భాగంగా సుమారు 40 వేల మందికి ప్రత్యేక టోకెన్ల ద్వారా ప్రవేశం కల్పిస్తుండగా, మిగిలిన సామాన్య భక్తులందరికీ ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గంటల తరబడి వేచి ఉండే సమయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. చందనోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2,300 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు క్యూ లైన్ల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచారు. సింహగిరి మొత్తం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :