Trainee IPS Case:ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ‘సూసైడ్ డ్రామా?

Follow Us: Google News Daily Hunt
Trainee IPS Uday krishnareddy Custody Ends
Trainee IPS Uday krishnareddy Custody Ends
FONT SIZE
GET APP

Trainee IPS Case: హైదరాబాద్‌ శివార్లలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపగా.. వైద్యుల పరీక్షల ల్యాబ్ రిపోర్టుతో అదంతా నాటకమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also :Trainee IPS Uday Krishna Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు

Trainee IPS Case

‘సూసైడ్ డ్రామా’ వెనుక నిజాలేంటి?

సహోద్యోగి అయిన మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ దాఖలైన విషయాన్ని గ్రహించిన ఉదయ్, తీవ్ర ఒత్తిడికి లోనై ఆదివారం అమీర్‌పేట్‌లోని తన స్నేహితురాలి గదికి వెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అధికంగా మద్యం సేవించడంతో స్పృహ తప్పి పడిపోయాడు. గదిలో శానిటైజర్ సీసా, ఖాళీ మద్యం సీసాలు ఉండటంతో అతడి సోదరుడు, స్నేహితులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని భావించి సోమవారం ఉదయం 9 గంటలకు ఎస్సార్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో పరీక్షించిన వైద్యులు, అతని రక్త నమూనాల్లో ఎటువంటి విషపూరిత పదార్థాలు (Toxic substances) లేవని తేల్చారు. కేవలం ఓవర్ డోస్ మద్యం వల్ల మాత్రమే స్పృహ కోల్పోయాడని స్పష్టం చేశారు. దీంతో కేసు నుంచి తప్పించుకుని సానుభూతి పొందేందుకే ఈ నాటకం ఆడారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మద్యం మత్తులో రాసిన లేఖ

ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులో ఒక లేఖ రాసినట్లు అధికారులు గుర్తించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తి అవాస్తవమని లేఖలో పేర్కొన్నాడు. సదరు మహిళా అధికారిణితో తనకు ఏడాది కాలంగా స్నేహపూర్వక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన వాట్సప్ చాట్‌లు, ఫొటోలు, వీడియోలను ఇప్పటికే ఆమె భర్తకు పంపించినట్లు రాసుకొచ్చాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళతో పాటు మరో నలుగురే కారణమని అందులో ఆరోపించాడు.

Trainee IPS Case:ఎన్‌పీఏ అంతర్గత విచారణ & పోలీస్ దర్యాప్తు

ఈ ఘటన నేషనల్ పోలీస్ అకాడమీ ప్రతిష్ఠకు సంబంధించినది కావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఎన్‌పీఏ పాలకమండలి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా నిందితుడిపై కఠినమైన శాఖాపరమైన చర్యల కోసం కేంద్ర హోంశాఖకు సమాచారం పంపనున్నారు. అత్తాపూర్ పోలీసులు అకాడమీలోని సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి ఫోన్ కాల్ డేటా, వాట్సప్ చాట్‌లను విశ్లేషిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు