Congress leader murder.. Sensational things come to light?

కాంగ్రెస్ నాయకురాలి హత్య.. వెలుగులోకి కీలక విషయాలు ?

రోహ్‌తక్ : హరియాణాకు చెందిన యువ కాంగ్రెస్‌ నేత హిమానీ నర్వాల్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగులు ఆమెను మార్చి 1న హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌ కేసులో కుక్కి రోహ్‌తక్‌-ఢిల్లీ హైవేపై పడేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవడానికి పోలీసులు సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. కాగా, ఆ వ్యక్తి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Advertisements
కాంగ్రెస్ నాయకురాలి హత్య వెలుగులోకి

సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు

నిందితుడితో హిమానీకి పరిచయం ఉన్నట్లు గుర్తించామన్నారు. కాగా హత్యకు గల కారణాలు, నిందితుడికి ఎవరైనా సహకరించారా అన్న వివరాలు తెలియాల్సి ఉందన్నారు. రోహ్‌తక్, రోహద్ టోల్ ప్లాజాల మధ్య 25 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయరహదారి పక్కన ఉన్న హోటళ్లు, దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఆమె పాల్గొన్న కార్యక్రమాలు, కలిసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఫిబ్రవరి 27 మధ్యాహ్నం వరకు తాను తన కుమార్తెతో ఉండి..అదే రోజు సాయంత్రం ఢిల్లీలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లినట్లు హిమానీ తల్లి సవిత పేర్కొన్నారు.

తన కూతురు రాజకీయంగా ఎదుగుతుండడం చూసి ఓర్వలేక

28న ఖాట్మండులో జరగనున్న కాంగ్రెస్ రోడ్‌షోకి తాను హాజరు కావాల్సిఉందని చెప్పిందని తెలిపారు. అనంతరం 28న మరోసారి తనతో మాట్లాడుతూ.. తన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయ్యేలా ఉందన్నట్లు చెప్పారు. తన కూతురు రాజకీయంగా ఎదుగుతుండడం చూసి సొంత పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఓర్వలేకపోయారని అన్నారు. రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపిందర్‌ హుడా కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దీనిని తట్టుకోలేని పార్టీ నాయకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లి ఆరోపించారు. తన కుమార్తెను హత్య చేసిన నిందితులను అరెస్ట్‌ చేసే వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించమని వెల్లడించారు.

Related Posts
పాకిస్థాన్‌లో రైలు హైజాక్: 27 ఉగ్రవాదుల మృతి
పాకిస్థాన్‌లో రైలు హైజాక్: 27 ఉగ్రవాదుల మృతి

హైజాక్‌ ఘటన ఎలా జరిగింది?పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్‌ చేసిన ఘటనలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఉగ్రవాదులు మస్కఫ్‌ టన్నెల్ వద్ద Read more

అదానీపై అమెరికా ఆరోపణలు వ్యూహాత్మక తప్పిదం: ఫోర్బ్స్ నివేదిక
gautam adani

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేసిన నేరారోపణ తీవ్రమైనవని, భౌగోళిక రాజకీయ పరిణామాలతో కూడిన వ్యూహాత్మక తప్పిదమని ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ నివేదిక Read more

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు
mohanbabu cm

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించిన Read more

పాత వాహనాలపై GST పెంపు
పాత వాహనాలపై GST పెంపు

పాత విద్యుత్ వాహనాలపై GST పెంపు: ప్రతిపక్షం విమర్శలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కౌన్సిల్ శనివారం Read more

Advertisements
×