CM Revanth Reddy review meeting on local body elections

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం

స్థానిక ఎన్నికలకు ముమ్మర కసరత్తు..

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.

Advertisements
image

ప్రధానంగా ఈసారి జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో నోటా ఉండాలా వద్దా అన్నది నేడు సమావేశంలో చర్చించనున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వార్డు సభ్యులనేవి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. ఒకరే పోటీలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ప్రకటించాలా? ఒకరితో పాటు నోటాన కూడా పెట్టి పోలింగ్‌ నిర్వహించాలా? అనే అంశంపై చర్చించనున్నారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం కచ్చితంగా నోటా అనేది ఉండాలి అన్నది కొన్ని సంఘాలు, సామాజికవేత్తలు చెబుతున్నారు.

కాబట్టి నోటా పెడితే ఏకగ్రీవం అయినా పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే నోటా ఉండాలా వద్దా అన్నది రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం తీసుకోనున్నది. ఇప్పటికే దీనిపై అభిప్రాయాలు తెలుపాలని నవంబర్‌లోనే ఎన్నికల సంఘం అన్నిపార్టీలకు లేఖ రాసింది. అయితే పార్టీల నుంచి స్పందన రాకపోవడంతో నేడు నేరుగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించిది.

Related Posts
రూ.80,500 కోట్ల అప్పు చేశారు.. అప్పు తప్పు అన్నోళ్లని దేనితో కొట్టాలి?: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల Read more

ఎమ్మెల్సీగా విజయశాంతి.. నామినేషన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీగా విజయశాంతి.. నామినేషన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేల కోటా ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించి, నామినేషన్ దాఖలు చేసింది. ఈ Read more

రామ్ చరణ్ కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?
indias biggest cutout of ra

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న Read more

తెలంగాణలో భారీగా పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!
telangana cold

తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా Read more

×