పెద్ద శంకరంపేట..
మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కులలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామునే అదే గ్రామానికి చెందిన ఒక రైతు పొలం వద్ద ఉన్న లేగదూడపై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ధ్రువీకరించారు. గ్రామస్తులు రాత్రి వేల ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్దకు వెళ్లాలంటే గుంపులుగా కలిసి వెళ్లాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు.