Board of Trustees of Yadagirigutta Temple.. Konda Surekha

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి: కొండా సురేఖ

Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బోర్డు పదవీకాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని, బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎటువంటి జీత భత్యాలు ఉండవన్నారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించి, నిర్వహించే అధికారాన్ని కలిగి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక,వేద విద్యా సంస్థలను నెలకొల్పే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisements
 యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి

ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి

వైటీడీకి అవసరమైన బడ్జెట్ ఆమోదం ప్రభుత్వ ద్వారానే జరుగుతుందని, అలాగే ఈవోగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తుల కోసం తగిన వసతులు లేనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వాటిని అందుబాటులోకి తెచ్చిందని ఆమె గుర్తుచేశారు.
ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి పాలక మండలి ఏర్పాటును నిర్ణయించినట్టు తెలిపారు .సమర్థవంతమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత ప్రగతిపథంలోకి తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే, ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

Related Posts
పాలస్తీనియన్లను విడుదల చేయనున్న ఇజ్రాయెల్‌
palestine prisoners

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ Read more

ఉత్పన్న ఏకాదశి రోజు తులసీ దేవికి ఇవి సమర్పిస్తే అదృష్టం మీ తలుపుతట్టుతుంది!
what is the use of tulasi plant and why the people pray 75712560

ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కృష్ణ పక్షం ఏకాదశి రోజున ఉత్పన్న ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తులసీ దేవిని పూజించడం, విష్ణువుకు Read more

రాజ్యాంగంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి: కెటిఆర్
రాజ్యాంగంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి కెటిఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ 'రాజ్యాంగాన్ని కాపాడండి' అనే నినాదంతో ర్యాలీ నిర్వహించడం, అదే సమయంలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎంఎల్ఎలను తమ పార్టీలోకి Read more

రైతు బంధును రద్దు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది : హరీశ్ రావు
Congress wants to abolish Rythu Bandhu. Harish Rao

హైదరాబాద్‌: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్‌ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×