Bhu Bharati : హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి భూభారతి పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటాపూర్ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్ చేయనున్నారు.

ధరణి ఆరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది.
‘భూ భారతి’ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా ఉండలేదని పొంగులేటి అన్నారు. దొరలకు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారని విమర్శించారు. ధరణి ఆరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్ తెచ్చాం అన్నారు.
ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు
ప్రజలు ఆమోదించని చట్టం కాబట్టే.. ధరణిని పక్కన పడేశాం. కలెక్టర్ దగ్గర ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశాం. వివిధ రాష్ట్రాల్లోని భూచట్టాలన్నింటినీ అధ్యయనం చేసి.. ఉత్తమ చట్టం రూపొందించాం. హరీశ్‌రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించాం. ముసాయిదాను మేధావులు, రైతుల ముందు పెట్టాం అని పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు.
Read Also: రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. నాలుగు అంశాలపై చర్చ!