Anganwadi workers demands are legitimate..YS Sharmila

అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి : షర్మిల

అమరావతి: అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైస్‌ షర్మిల అన్నారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనం. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలి.

Advertisements
అంగన్వాడీల డిమాండ్లు న్యాయ బద్ధమైనవి

మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా

అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలి. తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలి. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలి.

అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన

వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల తెలిపారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలు ముగిసిన తరువాత ఒకలా వ్యవహిరిస్తూ ఆంగన్వాడీలను చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందంటూ విమర్శించారు. తమ గోడు వినిపించాలనుకుంటోన్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు.

Related Posts
ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత ఇకలేరు
ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత ఇకలేరు

గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ Read more

‘తల్లికి వందనం’ పథకం అమలు ఎప్పుడంటే
'తల్లికి వందనం' పథకం అమలు ఎప్పుడంటే

ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రవేశ పెట్టేందుకు సమాయత్తం అయింది. 2025-26 వార్షిక బడ్జెట్ రేపు (శుక్ర వారం) అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. Read more

Modi, trump: ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు
ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు

ఉక్రెయిన్ , రష్యా మధ్య సంఘర్షణను ముగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు Read more

కోహ్లి ఈజ్ బ్యాక్
kohli

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి ఫామ్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గత కొన్ని నెలలుగా అతని ప్రదర్శన అంతగా మెరుగ్గా Read more

×