AP Government: 15 రోజుల్లోగా మైగ్రేషన్ పూర్తి చేయాల్సిందే – ఏపీ ఆర్థికశాఖ కఠిన ఆదేశాలు!

Follow Us: Google News Daily Hunt
Nidhi Payroll Application Migration
Nidhi Payroll Application Migration
FONT SIZE
GET APP

AP Government:ఎపి ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు తమ పరిధిలోని సంస్థల్లో నిధి పేరోల్ అప్లికేషన్లో మైగ్రేషన్, ఆన్బోర్డింగ్ ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి వాడ్రేవు వినయ్చంద్ ఆదేశించారు. సమస్యలున్న శాఖలు వెంటనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. కాంట్రాక్ట్, పార్టమ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేలా అన్ని శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిధి పేరోల్ అప్లికేషన్లో అన్ని కాంట్రాక్ట్, పార్టమ్, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కొన్ని శాఖలు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించింది.

Read also: Penuganchiprolu news: రాష్ట్ర అభివృద్ధిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచనలు

Nidhi Payroll Application Migration
Nidhi Payroll Application Migration

AP Government:వేతనాల జాప్యం లేకుండా చూడాలి

పోస్టుల కొనసాగింపునకు సంబంధించిన ఉత్తర్వులు లేకపోవడం, మంజూరు ఉత్తర్వుల ప్రతులు అందుబాటులో లేకపోవడం, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి కేటాయించిన పోస్టుల సంఖ్యపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతోందని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖాధిపతులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ జాప్యం వల్ల కాంట్రాక్ట్, పార్టమ్ ఉద్యోగులు తమకు రావాల్సిన వేతనాలకు దూరమవుతున్నారని, ఇది ప్రభుత్వ దృష్టిలో ఆందోళనకరమైన అంశమని సర్క్యులర్లో పేర్కొన్నారు. అలాగే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎపిసిఎఫ్ఎస్ఎస్ సిఇఒ అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించాలని ఆదేశించారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించే వేతన బిల్లులను అత్యవసర ప్రాతిపదికన ప్రాసెస్ చేసి ఉద్యోగులకు ఎటువంటి జాప్యం లేకుండా వేతనాలు అందేలా చూడాలన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు