ప్రతియేటా అఖిల భారత స్థాయిలో పలు వృత్తివిద్యా కోర్సులలో విద్యార్థుల ప్రవేశం కోసం ప్రభుత్వం ఐఐటి, నీట్, కేట్, క్లాట్ పేరిటవివిధ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా, పగడ్బందీగా నిర్వహిస్తుంది. ఈ పరీక్షల్లో ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్లిష్టమైన పరీక్షగా పేరు పొందింది. ఇదిలావుంటే ఈ ఒక్కొక్క పరీక్షను రాసేందుకుగాను లక్షణాది మంది విద్యార్థులు పోటీపడుతుంటా రు. ఈ పరీక్షలలో మంచిమార్కులు పొందిన విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటి, ఎయిమ్స్, ఐఐఎం, నేషనల్ లా కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఇదిఏటేటా నిర్విఘ్నంగా జరిగే వివిధ కోర్సుల ప్రవేశిక ప్రక్రియ. ఐతే పరీక్షలు రాసిన విద్యార్థుల్లో కొద్దిమందికే మంచిర్యాంకులు వస్తాయి. మంచిర్యాంకు రానివారికి ఈ విద్యాసంస్థలలో సీట్లు లభ్యం కావు. అందువల్ల ప్రత్యామ్నాయంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలలో వీరంతా ప్రవేశాలు పొందుతారు. ఐతే ఈ ప్రవేశాలు వివిధ రకాల పద్ధతులలో ఉంటాయి. అవి కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై కోటాలుగా ఉంటాయి. ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ లో కూడా కొన్ని మాత్రమే అత్యంత ప్రమాణాలు కలిగిన ఇన్స్టిట్యూట్స్ గా వెలుగొందుతున్నా యి. ఇక్కడ చదువు అన్ని విధాలా నాణ్యతతో కూడి ఉం టుంది. కోర్సు పూర్తయిన తర్వాత మంచి ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఇక్కడ చదవడానికి విద్యార్థులపై అధిక ఆర్థిక భారం పడుతుంది. ఇవిగాక మిగిలిన చాలా సంస్థలు నాసిరకమైన విద్యను మాత్రమే విద్యార్థులకు అందిస్తుంటాయి. వీళ్ళు కూడా వాళ్ల కాలేజీకున్న గుడ్విల్ని బట్టి రుసు ములు వసూలు చేస్తుంటారు.
Read Also : Chittoor ACB Raid: రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి పంజా: పారిపోయిన రిజిస్ట్రార్

దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలలో ఎం.బి.బి.ఎస్, బి.డి.ఎస్ కోర్సులలో ప్రవేశం కొరకు నీట్ ఎగ్జాం (medical education)జరుగుతుంది కదా! ముఖ్యంగా ఈ నీట్ పరీక్షలో కన్వీనర్ కోటాలో సీట్లు రాని విద్యార్థులు కొంత మంది బి, సి కేటగిరిల్లో సదరు కళాశాల యాజమాన్యాలకు డొనేషన్స్ చెల్లించి అడ్మిషన్స్ పొందుతారు. బి కేటగిరిలో కూడా ర్యాంక్ ఆధారిత ప్రవేశముంటుంది. డొనేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సి క్యాటగిరిలోనైతే విద్యార్థి మినిమం కట్ ఆఫ్ మార్కులు పొందియుండాలి. వీరు అధిక డొనేషన్స్ చెల్లిస్తేగాని సీట్ లభించదు. అంటే ఈ సంస్థల్లో అనేక రకాల పేర్లతో ఆయా యాజమాన్యాలు విద్యార్థుల నుండి పెద్దయెత్తున ఫీజులు వసూలు చేయడం గమనార్హం. ధనికులైన విద్యార్థులు ఇష్టపడి, ఆయా సంస్థల్లో పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి చదువుకోవడం వల్ల ఆర్థికంగా దేశ ప్రజలకైతే ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఇలా చది విన వారివల్ల సామాజిక నష్టమైతే కచ్చితంగా ఉంటుంది. ప్రతిభలేని విద్యార్థులు తయారై క్షేత్రస్థాయిలో ఏ రకమైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తారు? వీరివల్ల పేద, మధ్యతర గతి వర్గాలకు నాసిరకమైన వైద్యమే అందుతుంది కదా! ఎందుకంటే, ఇలా పట్టాలు పొందిన వైద్యులు మంచి వైద్యా న్ని ప్రజలకు అందించలేరన్నది సత్యం. హెచ్చుశాతం ప్రైవేటు మెడికల్ కాలేజ్ బోధనాసుపత్రులలో (medical education)రోగులు లేక ఎప్పుడూ బెడ్స్ ఖాళీగానే ఉంటుంటాయి. ఎంత ఎక్కువమంది రోగు లు ఉంటే అంత విషయ పరిజ్ఞానం చదివే జూనియర్ డాక్టర్లకి వస్తుంది. కానీ దీనికి భిన్నమైన పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ చదివే వారికి సబ్జెక్ట్ ఉండదు. ప్రాయోగికజ్ఞానం లేని వీళ్లు స్టెతస్కోపులు ధరించి చికిత్స చేస్తే, రోగి చావక మరేం జరుగుతుంది?
కొంతమంది డాక్టర్ల పిల్లలు కూడా నీట్ పరీక్షల్లో ప్రయత్నాలు చేయగా చేయగా, సరైన ర్యాంక్ లు రాకపోవడంతో మేనేజ్మెంట్ కోటాలో ఎం.బి.బి.ఎస్ సీట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇంకా కోట్లుపెట్టి పోస్ట్ గ్రాడ్యు యేషన్, స్పెషలైజేషన్ సీట్స్ కొంటుంటారు. వీళ్లంతా డాక్టర్లుగా తయారైతమ తాతతండ్రుల వారసత్వంతో ఆసుపత్రు లు నిర్వహిస్తుంటారు. ఐతే వీరికి ఎటువంటి మెడికల్ సర్జి కల్ చికిత్సా నైపుణ్యం ఉండదు. వీరంతా ఆసుపత్రులలో రోగులు పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంటారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతారు. రోగుల నుండి డబ్బులు గుంజుకోవడానికి ఈ వైద్యులు రక రకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. తమ ఆసుపత్రిలో ఉండే ల్యాబ్స్, ఫార్మసీ, స్కానింగ్ సెంటర్స్ మొదలగు విభా గాల ద్వారా రోగులను పీడించుకొని తింటారు. ప్రతి విభా గం నుండి వీరికి పెద్దయెత్తున కమిషన్స్ వస్తుంటాయి. ఉన్నవీ, లేనివీ నివేదికలలో పొందుపరిచి రోగులను, రోగి బంధువులను గందరగోళ పరుస్తారు. ఇంతేకాదు ఇంకా క్షేత్ర స్థాయిలో నకిలీ వైద్యులు లేకపోలేదు. కొంతమంది చదివిన సంస్థలకురికగ్నేషనే ఉండదు. నకిలీ విశ్వవిద్యాలయాలు పేరుమీద నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ప్రాక్టీస్ చేసేవారు కూడా ఉంటారు. పల్లెల్లో వైద్యం చేసే ప్రాక్టీషనర్స్్స్క ప్రామా ణికమైన ధ్రువపత్రాలుండవు. అయినా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంజక్షన్ చేయడం వచ్చిన వాళ్లంతా డాక్టర్లు గానే చెలామణి అవుతుంటారు. ఇంకా హస్తవాసి లేని డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా ప్రాక్టీస్ లేక తమ క్లినిక్ లలో ఖాళీగా ఉండడం చూస్తుంటాం. ఐతే వీటికి భిన్నమైన పరిస్థితి చిన్న పట్టణాలలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ లో నెలకొని ఉంటుంది. సాధారణంగా గోల్డెన్ అవర్స్ లో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చే రోగులు ఉంటారు. చివరి క్షణంలో వచ్చే ఇలాంటి కేసుల్లో చావైనా బ్రతుకైనా ఫిఫ్టీ ఫిఫ్టీయే ఛాన్సెస్ ఉంటుంది. సదరు డాక్టరు రోగి కుటుంబ సభ్యుల అభ్యర్థనతో చికిత్స ప్రారంభిస్తారు. ఒక్కోసారి కొన్ని కేసులు ఫెయిల్ అవ్వొచ్చు. అలాంటప్పుడు రోగి బంధువులు డాక్టర్ పై నిందలు మోపుతుంటారు. ఆసుపత్రిపై పడి భౌతిక దా డులు చేస్తుంటారు. ఇది ఎంతమాత్రమూ తగని పని. ఒక వేళ డాక్టర్ చేసిన చికిత్సలో నిర్లక్ష్యం కనిపిస్తే చట్ట ప్రకా రం ప్రొసీడ్ కావాలి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని సదరు వైద్యులపై దాడిచేయడం అన్యాయం. దీనివల్ల జనా నికి ఒరిగే లాభమేంటి? ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తిరిగి వస్తాడా? ఇలా డాక్టర్లపై దాడిచేయడం వల్ల గోల్డెన్ అవర్స్ లో వచ్చే రోగుల పరిస్థితి ఏమిటి? డాక్టర్లు ఇకముందు అత్య వసర చికిత్సలు అందిస్తారా? ప్రతీ కేసును చూసినవెంటనే రిఫర్ చేసేస్తారు కదా! ఇది ప్రజలకే నష్టం కదా! ఐతే ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఎదురుకావు.

ఎందుకంటే, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎవ రైనా రోగి మరణిస్తే, దాన్ని జనం సర్వసాధారణంగానే భావి స్తారు. సదరు వ్యక్తికి ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయా యి, డాక్టర్లు ఐతే మాత్రం ఏంచేస్తారు? అనే భావనతో ఉంటారు. అందువల్ల డాక్టర్లపై ఎటువంటి దాడులు జరిగే అవకాశాలు ఉండవు. ఇదే పరిస్థితి పెద్ద పట్టణాల్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా కనిపిస్తుంది. అక్కడకు గోల్డెన్ అవర్స్ లో వెళ్లిన రోగులకు వైద్యులు పరీక్ష చేసి, చికిత్స అందిస్తారు. చికిత్స కని భారీగా డబ్బులు వసూలు చేస్తారు. ఐనా అక్కడా కేసులు ఫెయిలై రోగులు చనిపోతుం టారు. ఆ వైద్యులను రోగుల బంధువులు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఏ విధంగానూ నిలదీయలేరు. నిలదీయడా నికి ఎటువంటి ఆస్కారం వారికి దొరకదు కూడా. అదే చిన్న పట్టణాల్లోనైతే ఇలాంటి సందర్భాలలో జనం మూకుమ్మడిగా ఆసుపత్రి మీదపడి, దాడులు చేస్తుంటారు. ప్రైవేట్ ఆస్తుల నష్టానికి ఒడిగడుతుంటారు. ఐతే ఇలాంటి రిస్కులను భరిం చి ప్రైవేటు డాక్టర్లు చికిత్సలు చేసేందుకు ఏవిధంగా ముం దుకు వస్తారు? వారు చేతులెత్తేయడం తప్పితే, భవిష్యత్తు లో మరొకటి ఉండదు. ఐతే వైద్యుల రక్షణకు కూడా కొన్ని చట్టాలు లేకపోలేదు. తమ వృత్తి ధర్మాన్ని ఎటువంటిఒత్తిడి లేకుండా నిర్వహించుకునే హక్కులు వారికి ఉంటాయి. వాటిని రోగి బంధువులు పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యు లు తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలి. దీనిలో భాగంగా నైతికతతో చికిత్సచేయడం, నిర్లక్ష్యానికి దూరంగా ఉండటం, సరైన నివేదికలను నిర్వహించడం వీరి బాధ్యత. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదు. ఈ దేశంలో అప్రజస్వామికంగా ప్రవర్తించడం ఎప్పటికీ చెల్లనేచెల్లదు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేనేలేవు.
-పిల్లా తిరుపతిరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: