అఘా సల్మాన్‌ సంచలన వ్యాఖ్యలు

అఘా సల్మాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ నెల ఫిబ్రవరి19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అంతా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. అలాగే టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇండియా – పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, పాక్‌ రెండు దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. ఇండియా-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే ఆటగాళ్లపై కూడా భారీ ఒత్తిడి ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరాలని ఇరు దేశాల అభిమానులు కూడా కోరుకుంటారు. పైగా ఈ రెండు దేశాలు ఐసీసీ ఈవెంట్స్‌లోనే పాల్గొంటున్నాయి. అయితే తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ గురించి పాక్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Advertisements

పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌ను గెలవడమే తమ ప్రాధాన్య లక్ష్యమని పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ అన్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫిబ్రవరి 23న క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోటీ మాత్రమే కాకుండా, రెండు దేశాల అభిమానుల మధ్య ఉన్న భారీ ఉత్కంఠను కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియాపై గెలవడం ముఖ్యమా? లేక ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ప్రధానమా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, తమ దేశం నిర్వహిస్తున్న చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఐసీసీ నిర్వహించడం తమకెంతో స్పెషల్‌ అన్నాడు. లాహోర్‌ గడ్డపై టైటిల్‌ అందుకోవాలన్నదే తమ టీమ్‌ టార్గెట్‌ అన్నారు. తమ కల నెరవేరుతుందని భావిస్తున్నానని,టైటిల్ గెలిచే సత్తా తమకుందని అఘా సల్మాన్ అభిప్రాయపడ్డారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అఘా సల్మాన్ వ్యాఖ్యలు

పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో మ్యాచ్‌ అంటే ఒత్తిడి ఉండటం సహజమని చెప్పిన అతను, ఒక వేళ మేం ఇండియాపై గెలిచి, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు. కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిస్తే అది పెద్ద విషయం అవుతుంది అని పేర్కొన్నారు. ఇది క్రికెట్ ప్రేమికుల్లో భారీ చర్చకు దారితీసింది.

భారత అభిమానుల కౌంటర్

అఘా సల్మాన్ వ్యాఖ్యలపై భారత అభిమానులు స్పందిస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు భారత జట్టును ఓడించే సత్తా లేదని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని, ఈసారి కూడా భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడిస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.

Related Posts
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్..
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్..

IPL 2025 ప్రారంభంకి సిద్ధమవుతున్నందున,ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నట్లు ఫ్రాంచైజీ ఇటీవల ప్రకటించింది.అయితే, మొదటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కనిపించరు.అతడు సారథిగా లేకపోవడంతో, ఆ Read more

 స్వదేశంలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురయ్యే అవకాశం ఉంది
rohit sharma test 1

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో, భారత్ 0-2 తేడాతో పరాజయం పాలైంది. ఈ ఫలితంతో, భారత జట్టు 12 ఏళ్ల తర్వాత తన Read more

భారత కుర్రాళ్లకు షాక్‌
india boys

అల్ అమెరాత్ (ఒమన్‌): మూడు వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత 'ఎ' జట్టు ఎమర్జింగ్‌ టీమ్స్ ఆసియా కప్‌ టీ20 టోర్నీలో అంచనాలకు విరుద్ధంగా సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌ Read more

శిఖ‌ర్ ధావ‌న్ కు అరుదైన గౌర‌వం
శిఖ‌ర్ ధావ‌న్ కు అరుదైన గౌర‌వం!

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన భారత క్రికెటర్ శిఖ‌ర్ ధావ‌న్ మరొక అరుదైన గౌర‌వాన్ని పొందారు. ఈ నెల‌ 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ Read more

×