Action should be taken against those responsible for the death of the deer.

KTR : జింక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి : కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

Advertisements

జింకపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి

కంచ గ‌చ్చిబౌలిలో 100 ఎక‌రాల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డంతో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ సౌత్ క్యాంప‌స్ హాస్ట‌ల్ వైపు జింక వ‌చ్చింది. జింక‌ను చూసిన కుక్క‌లు మొరుగుతూ.. దానిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాయి. కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన జింక‌ను హెచ్‌సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది.. వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జింకకు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. దీంతో అది చ‌నిపోయింది.

మూడు రోజుల్లో 100 ఎక‌రాల్లో ప‌చ్చని చెట్ల‌ను న‌రికివేత

ఇక, చాలా జింక‌లు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. ఆ జింక‌ల‌ను జ‌నాలు చేర‌దీసి.. వాటికి నీళ్ల‌ను అందిస్తున్నారు. మూడు రోజుల్లో 100 ఎక‌రాల్లో ప‌చ్చని చెట్ల‌ను న‌రికివేయ‌డంతో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై జ‌నాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు క‌లిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

Related Posts
తెలంగాణ లో మందుబాబులకు కిక్కు పెంచే న్యూస్
kicks drug addicts in Telan

తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ధరల పెంపుపై ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు. సాధారణంగా, Read more

Kolkata: మద్యం మత్తులో కారు నడిపిన డైరెక్టర్..ఆపై ప్రమాదం
మద్యం మత్తులో కారు నడిపిన డైరెక్టర్..ఆపై ప్రమాదం

సినీ దర్శకుడు సిద్ధాంత్ దాస్ మద్యం సేవించి వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ Read more

21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, Read more

Apsara: అప్సర హత్య కేసులో సంచలన తీర్పు పూజారికి జీవిత ఖైధీ
Apsara: అప్సర హత్య కేసులో సంచలన తీర్పు పూజారికి జీవిత ఖైధీ

పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్సరను పెళ్లి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×