పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..

pawan paul

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కల్యాణ్ ఉల్లంఘించారని కేఏ పాల్ ఆరోపించారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని ఆయన పేర్కొన్నారు.

అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడింది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జులైలో అని కేఏ పాల్ అన్నారు. పంజాగుట్ట పోలీసులతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సీబీఐలకు ఫిర్యాదు కాపీలను పంపనున్నట్లు కేఏ పాల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Russians stage a rare protest after a dam bursts and homes flood near the kazakh border.