ఆఫ్ షోర్ మైనింగ్ టెండర్లపై రాహుల్ స్పందన

Rahul Gandhi: ప్ర‌ధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhi: ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ కేర‌ళ‌, గుజ‌రాత్‌, అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇచ్చే టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌డం వ‌ల్ల‌.. స‌ముద్ర జీవాల మ‌నుగ‌డ‌కు ప్ర‌మాదంగా మారుతుంద‌న్నారు. ప్రైవేటు కంపెనీల‌కు ఆఫ్‌షోర్ మైనింగ్ అనుమ‌తి ఇవ్వ‌డం ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. కేర‌ళ‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవిలో మైనింగ్‌కు ప‌ర్మిట్ ఇస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Advertisements
 ప్ర‌ధాని మోడీకి రాహుల్ గాంధీ

ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌కుండానే అనుమ‌తులు

త‌మ జీవ‌నోపాధి, జీవితాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ల‌క్ష‌ల సంఖ్య‌లో జాల‌ర్ల కుటుంబాలు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు రాహుల్ త‌న లేఖ‌లో గుర్తు చేశారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌డాన్ని ఖండిస్తున్న‌ట్లు రాహుల్ త‌న లేఖ‌లో తెలిపారు. ఆఫ్‌షోర్ మైనింగ్ కోసం టెండ‌ర్లు నిర్వ‌హించిన ప్ర‌క్రియను కోస్ట‌ల్ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌కుండానే అనుమ‌తులు ఇచ్చార‌ని ఆరోపించారు.

మ‌త్స్య సంప‌ద కూడా త‌గ్గిపోతుంద‌ని

ఆఫ్‌షోర్ ఏరియాస్ మిన‌ర‌ల్ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత తెలిపారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌తో మెరైన్ లైఫ్‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని, కోర‌ల్ రీఫ్స్ డ్యామేజ్ జ‌రుగుతుంద‌ని, మ‌త్స్య సంప‌ద కూడా త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 13 ప్ర‌దేశాల్లో ఆఫ్ షోర్ మైనింగ్ కోసం ఖ‌నిజ మంత్రిత్వ‌శాఖ టెండ‌ర్లు ఆహ్వానించింది. ఆ స‌మ‌యంలో తీవ్ర నిర‌స‌న‌లు జ‌రిగిన‌ట్లు రాహుల్ త‌న లేఖ‌లో తెలిపారు. కొల్లాంలో మెరైన్ మానిట‌రింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఫిష్ బ్రీడింగ్ స‌మ‌స్య ఏర్ప‌డనున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Related Posts
ఏపీలో కీలకమైన 6 రైళ్లు రద్దు
4 more special trains for Sankranti

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలో నిత్యం తిరుగుతున్న కొన్ని రైళ్లను రద్దుచేసి కుంభమేళాకు పంపిస్తోంది. Read more

South Railway : మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్ – రైల్వేశాఖ
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్తను ప్రకటించింది. వివిధ కారణాల వల్ల రద్దయిన రైళ్ల టికెట్ డబ్బును ప్రయాణికులకు కేవలం మూడు రోజులలోపే తిరిగి చెల్లించనున్నట్లు Read more

క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?
chaitu weding date

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహం డిసెంబర్ 4న జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడవచ్చని సమాచారం. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×