High Court orders not to arrest KTR for ten days

కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఉరట

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదించారు.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు… ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 నాడు ఫిర్యాదు వస్తే 19 నాడు ఎఫ్ఐ‌ఆర్‌ చేశారు… ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐ‌ఆర్‌ చేశారన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు లేదని వాదించారు. 2023 అక్టోబర్ లో చేసుకున్న అగ్రిమెంట్ పరకారమే FEO కి చెల్లించారని.. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని కేటీఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదు..13(1)a, 409 అనే సెక్షన్ లు వర్తించవన్నారు. 2024 లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి..కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందన్నారు.

ప్రాధమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దమనిఅఫెన్స్ జరిగిందని తెలిసాక మూడునెలల లోపే కేసు రిజిస్టర్ చేయాలన్నారు. 11నెలల తర్వాత కేసు నమోదు చేశారు ..లలిత కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఈ కేసులో వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్ రిసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని.. సీజన్ 9 లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలిపారు. సీసన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది…దీంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందని.. ఎన్నికల కోడ్ ఉల్లగించారనడానికి ఎలాంటి అధారాలు లేవన్నారు. ప్రొసీజర్ పాటించలేదు అనడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో కేటీఆర్ లబ్ది పొందేలదన్నారు.

ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారని.. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగిన న్యాయమూర్తి.. ఏజీ ఆ పత్రాలు అందించారు. ఎఫ్ఐ‌ఆర్‌ ద్వారానే దర్యాప్తు జరుగుతుందని…ప్రతి విషయం ఎఫ్ఐ‌ఆర్‌లో ఉండదు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయన్నారు. దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్య లైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని.. విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింది. ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Com – gaza news. England test cricket archives | swiftsportx.