మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు..

mohan babu case on manoj

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం పెద్ద సంచలనానికి దారితీసింది. మంచు మనోజ్, ఆయన భార్య ప్రాణహాని ఉందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి కొత్త మలుపు తిప్పింది. మనోజ్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని పది మందిపై కేసు నమోదైంది.

ఇక మరోవైపు మోహన్ బాబు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి, తనకు తనయుడి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొనడం కలకలం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంపై మోహన్ బాబు నుంచి ఫిర్యాదు రావడంతో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆ కుటుంబం అంతర్గత సమస్యలు ఇప్పుడు బయటపడటమే కాకుండా, టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసాయి.ఈ ఆరోపణలపై మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పిన మనోజ్, తాము ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వివాదంలో తన ఏడునెలల పాపను లాగడం అమానవీయమని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలకు విరుద్ధంగా ఉన్న సాక్ష్యాలను అధికారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.ఇదే సమయంలో తన తండ్రి చేసిన ఈ ఆరోపణలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కారణమవుతాయని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎప్పుడూ కుటుంబ ఐక్యత కోసం నిలబడతానని, నిజాయితీకి తోడుగా ఉండడమే తన ధర్మమని తెలిపారు. తండ్రి చూపిన దారిలోనే నడిచిన తనను ఇప్పుడు ఇలా విమర్శించడాన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతున్నట్లు అభిప్రాయపడ్డారు.ఇప్పటికే మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం చివరికి ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది. సత్యం, న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయని నమ్మకం ఉంచుకుంటున్నానని మనోజ్ తన మద్దతుదారులకు ధన్యవాదాలు తెలుపుతూ, న్యాయం కోసం ఎప్పటికీ పోరాడతానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Life und business coaching in wien – tobias judmaier, msc. Latest sport news.