Headlines
manchu manoj

పోలీసుల సూచనలతో వెనుతిరిగిన మంచు మనోజ్‌

మోహన్‌బాబు, మంచు మనోజ్‌ల మధ్య రోజుకో మలుపు తిరుగుతూ జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీకి మంచు మనోజ్‌ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు జరిపిన చర్చలతో మంచు మనోజ్‌ తన తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. అయితే తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.

అనంతరం ఆయన పోలీసు స్టేషన్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదని, సంక్రాంతి పండుగను కూతురుతో కలిసి జరుపుకుందామని వచ్చానని తెలిపారు. అయితే రెండు రోజుల పాటు తనను పండుగను జరుపుకోకుండా ఆటంకాలు సృష్టించారని మీడియాకు వివరించారు.తాను తిరుపతికి వస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్లను చించివేయడం, అభిమానులను బెదిరించడం సరికాదని అన్నారు. ఫ్యాన్స్‌ను బెదిరించకుండా ఉంటే సైలెంట్‌గా ఉండేవాడినని తెలిపారు. తన కుటుంబ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో గాని, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే నానికి వివరించ లేదని, సహాయం చేయాలని కూడా ఎవరినీ అడగలేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Votre compte | cours ia gratuits et certification udemy. Reviews top traffic sources. Οι εκπρόσωποί μας θα είναι εκεί για να σας εξυπηρετήσουν και να δεχθούν την πληρωμή σας.