Headlines
Barack Obama, Michelle divorce..?

బరాక్ ఒబామా, మిషెల్ విడాకులు..?

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మిచెల్‌ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఒబామా హాజరుకానుండగా ఆయన సతీమణి, మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

image
image

ఈక్రమంలో ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, అందువల్లే ఈ కార్యక్రమానికి మిచెల్‌ హాజరు కావడంలేదని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఒబామా దంపతులకు విడాకులు ఖాయమైనట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలోనే మిచెల్‌.. బరాక్‌ ఒబామాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు 2012లో విడుదలైన ఓ పుస్తకంలో వెల్లడించారు. వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించేందుకు తాము కౌన్సెలింగ్‌ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్‌ ఓ ఇంటర్వ్యూలోనూ తెలిపారు.

కాగా, బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా జోడీ 1989లో డేటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత 1992లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలంగా వీరి బంధంలో విభేదాలు మొదలయ్యాయి. వాస్తవానికి గత కొంతకాలంగా బరాక్ ఒబామా దంపతులు ఎక్కడా బహిరంగంగా కలిసి కనిపించింది లేదు. అప్పుడే వీరిద్దరి విడాకుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ప్రచారం కాస్తా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయింది. దీనికి తాజా ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. దీంతో త్వరలో అధికారికంగా వీరు విడాకుల ప్రకటన చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

à propos | cours ia gratuits et certification udemy. Sample page » increase sales. Υψηλή υδατοστεγανότητα, λειτουργικότητα, αξιοπιστία και άνεση ακόμα και για μεγάλα βάρη που προκύπτουν στα μεγάλα ανοίγματα.