Headlines
kavati manohar

గుంటూరులో వేడెక్కిన కౌన్సిల్ సమావేశం

గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. దీనితో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. గుంటూరులో వైసీపీ నేతలు అత్యవసర సమావేశం అయ్యారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు కమిషనర్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. మేయర్‌కు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఈ సభలో కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.


ఈనెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. వాయిదా పడిన అనంతరం 3 రోజులకు కౌన్సిల్ సమావేశం తప్పనిసరిగా పెట్టాలని చెప్పారు. రేపు (శుక్రవారం) నాటికి వైసీపీ కార్పొరేటర్లు అందరూ నగరపాలక సంస్థకు చేరుకుంటారని తెలిపారు.కమిషనర్ ఎలా వ్యవహరిస్తారనే విషయంపై శుక్రవారం గమనించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ మాత్రమే సుప్రీం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ నేతలు గురువారం అత్యవసర సమావేశం అయ్యారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు మేయర్ మరో 14 నెలలు అధికారంలో ఉంటారని తెలిపారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాత్రమే కౌన్సిల్ నుంచి వాకౌట్ చేస్తారని అన్నారు. కమిషనర్ తీరును తప్పుపడుతూ ఏపీవ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Produits | cours ia gratuits et certification udemy. Reviews top traffic sources. Υψηλή υδατοστεγανότητα, λειτουργικότητα, αξιοπιστία και άνεση ακόμα και για μεγάλα βάρη που προκύπτουν στα μεγάλα ανοίγματα.