ఈ సంక్రాంతి తెలుగు సినిమా అభిమానులకు పండగే పండగగా మారింది. గేమ్ ఛేంజర్. డాకు మహారాజ్ వచ్చాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఉన్నా కూడా, బాలకృష్ణ, వెంకటేష్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. డాకు మహారాజ్, సంక్రాంతికి వచ్చాం సినిమాలు అదిరిపోయే కలెక్షన్లను రాబడుతున్నాయి.సీనియర్ హీరోలు చాలా కాలం తర్వాత సంక్రాంతిని తమదైన శైలిలో ఆడిపాడారు.2025 సంక్రాంతి పండుగను సీనియర్ హీరోలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు.ఇది చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తున్న దృశ్యం.
ఒకప్పుడు బాలయ్య, వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేది.కానీ కాలక్రమేణా వారి మార్కెట్ తగ్గిపోయింది. అయితే బాలయ్య తిరిగి తన సత్తా చాటారు.వెంకటేష్ కూడా సరైన కథతో వచ్చినప్పుడు తన మార్క్ చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగపై దూకుడు చూపిస్తున్నారు.60 ఏళ్లకు పైబడి ఉన్న హీరోలు టాలీవుడ్‌ను ఏలడం నిజంగా గర్వకారణం.రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా పోటీలో ఉన్నా కూడా, బాలయ్య, వెంకటేష్ బాక్సాఫీస్‌ను గట్టిగా పట్టుకున్నారు. ఒకవైపు సంక్రాంతికి వచ్చాం తో వెంకటేష్, మరోవైపు డాకు మహారాజ్ బాలయ్య కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు.
తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత దూకుడుగా ఉన్నారు.సంక్రాంతికి వచ్చాం సినిమాతో మొదటి రోజే రూ.35 కోట్ల షేర్ వసూలు చేశారు. అనిల్ రావిపూడి మ్యాజిక్‌తో వెంకటేష్ ఇమేజ్ కలిసొచ్చి సినిమా రికార్డులు తిరగరాస్తోంది. ఈ వేగం కొనసాగితే రూ.100 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను సాధించారు. మొదటి రోజే రూ.56 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, తరువాతి రెండు రోజుల్లో మరో రూ.45 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.ఈ రెండు సినిమాల జోరు ఇప్పటికీ తగ్గడం లేదు.