Headlines
wayanad disaster

వయనాడ్‌ మృతులకు కేరళ సర్కార్‌ పరిహారం

కేరళలోని వయనాడ్‌లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది. మిస్ అయిన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

కాగా, గతేడాది జులై 30న వయనాడ్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మరో 35 మంది మిస్సయ్యారు.

ఈ కమిటీ విపత్తులో తప్పిపోయిన వారి జాబితాను తయారు చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి సమర్పిస్తుంది. డీడీఎమ్‌ఏ ఆ జాబితాను పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపితే.. అక్కడి నుంచి ఆ జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారిని ప్రభుత్వం మృతులుగా ప్రకటించి.. వారి బంధువులకు పరిహారం అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is fka twigs. Dealing the tense situation. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.