రమ్యకృష్ణ అనే పేరు వినిపించగానే ప్రేక్షకులు ఆమె ఎనలేని నటనను గుర్తుచేసుకుంటారు. నీలాంబరి నుండి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రల్లో ఆమె చేసిన ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆమె గర్వించదగిన కెరీర్‌లో అనేక అవార్డులు అందుకున్నారు. ఆ అవార్డులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘కంటే కూతుర్నే కనాలి’ చిత్రంలో రమ్యకృష్ణ నటనకు నంది అవార్డుల వేడుకలో ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు.
ఇది ఆమె మొదటి అవార్డు.1999లో వచ్చిన ‘పాడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) సినిమాలో నీలాంబరి పాత్రతో ఆమె తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ నటి – తమిళం విభాగంలో అవార్డును అందుకున్నారు.2009లో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలో హీరో సిద్దార్థ్ తల్లిగా చేసిన పాత్రకు 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ సహాయ నటి – తెలుగు అవార్డు లభించింది. అదే ఏడాది ‘రాజు మహారాజు’ సినిమాకు కూడా ఉత్తమ సహాయ నటి అవార్డును పొందారు.2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలో రాజమాత శివగామి దేవిగా ఆమె నటనకు మొత్తం 5 అవార్డులు అందుకున్నారు.
ఇందులో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆనంద వికటన్ సినిమా అవార్డు, IIFA ఉత్సవం తెలుగు మరియు తమిళ విభాగాలలో 2 అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉన్నాయి.2017లో ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ సినిమాలో శివగామిగా చేసిన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారు. బాహుబలి రెండు పార్ట్స్ కలిపి ఆమె మొత్తం 7 అవార్డులు గెలుచుకున్నారు.తర్వాత ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో ఆమె పాత్రకు ఉత్తమ సహాయ నటి (ఫిమేల్) విభాగంలో జీ సినీ అవార్డు (తమిళం) మరియు ఆనంద వికటన్ సినిమా అవార్డు లభించాయి.