Headlines
Inauguration of AICC new office, Indira Gandhi Bhavan, in Delhi

ప్రారంభమైన ఏఐసీసీ నూతన కార్యాలయం

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనానికి ఇందిరాగాంధీ అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయాని కాంగ్రెస్‌ నిర్మించింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు ఇందిరాగాంధీ భవన్ కి మారనున్నాయి. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గతంలో, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా, వివిధ పార్టీలు తమ సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

1978 నుండి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తోంది. 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Click here to get the fox news app. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.