కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ బాధితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వన్ టైమ్ పేమెంట్ కింద 770 డాలర్ల (రూ.66,687) పరిహారం ప్రకటించారు. వందలాది మంది తమ జీవితంలో సర్వం కోల్పోయిన బాధితులు ఈ పరిహారాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అయితే, ఈ ప్రకటనపై అమెరికా పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, పౌరులు సోషియల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “ఉక్రెయిన్కు బిలియన్ల డాలర్లు ఇస్తూ, అమెరికన్ పౌరులకు తగిన పరిహారం ఇవ్వలేకపోవడం ఏమిటి?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైల్డ్ ఫైర్ ధ్వంసానికి గురైన తమ జీవితాలు ఈ 770 డాలర్లతో తిరిగి సాధ్యం అవుతాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక నష్టం, ఆస్తుల నష్టానికి ఎదురీదుతున్న బాధితులు ఈ పరిహారం గురించి చురకలు వేస్తున్నారు. ఈ డబ్బుతో ఒక రాత్రి హోటల్ బిల్లుకూడా చెల్లించలేమని విమర్శలు వచ్చాయి. 770 డాలర్లు అమెరికా జీవన శైలికి సరిపడదని పౌరులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం చేస్తూ, కాలిఫోర్నియా పౌరులకు తక్కువ పరిహారం ప్రకటించడం అన్యాయమని పౌరులు అంటున్నారు. తమ దేశం ఆర్థికంగా వెనుకబడిపోయినవారికి సహాయం చేయడం కంటే, విదేశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ పరిహారం విషయంలో అమెరికా ప్రజలు ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులకు సరైన ఆర్థిక సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు అభిప్రాయపడుతున్నారు. 770 డాలర్ల పరిహారం తమ బాధలను ఉపశమనం చేయలేదని నిరాశతో ఉన్నారు.