Headlines
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ

ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ

8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ ప్రపంచం మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రారంభమై, మార్చి 9 వరకు జరగనుంది.ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు ఈ పోటీలో పాల్గొనడం లేదు.ఆ జట్టు క్వాలిఫై కాకపోవడం విశేషం.ఈ మెగా టోర్నీలో భాగంగా, జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి.గ్రూప్-ఎలో భారతదేశం,పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి.అయితే, గతంలో ప్రతిసారి పాల్గొన్న శ్రీలంక జట్టు ఈసారి టోర్నీలో భాగం కావడం లేదు.2023 వన్డే వరల్డ్ కప్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన శ్రీలంక, ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత పొందలేదు.ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సారి 1998లో ప్రారంభమైంది.శ్రీలంక గతంలో ఈ టోర్నీలో స్థిరమైన ప్రదర్శన ఇచ్చింది. 2002లో టీమిండియాతో కలిసి శ్రీలంక జట్టు సంయుక్త విజేతగా నిలిచింది.

ఆ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు సార్లు రద్దు కావడంతో, రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.2002 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 29న జరిగింది.శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 244 పరుగులు చేసింది. భారత జట్టు కేవలం రెండు ఓవర్లు ఆడగలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్‌ డేలో మళ్లీ మ్యాచ్ జరిగింది కానీ, మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. టోర్నీపై ఆసక్తి పెంచేందుకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రికెట్ ప్రేమికులు టోర్నీని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *